21, నవంబర్ 2012, బుధవారం

రైతే రాజయ్యే రోజు కోసం

నా పేరు రమ. మాది తూర్పుగోదావరి జిల్లా. నేను ఒక స్టూడెంట్‌ని. నాకు రాజకీయాల మీద సరైన అవగాహన లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న విషయాల్ని చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా నాకో విషయం సరిగా అర్థమవుతోంది... ఇదంతా కక్షా రాజకీయం అని.

దివంగత డా.వైయస్‌రాజశేఖరరెడ్డి గారు తెచ్చిన ప్రభుత్వం వారికి కావాలి, ఆ పదవులు కావాలి, కానీ వారి కుమారుడు మాత్రం అధికారంలోకి రాకూడదు. ఇది చాలా అమానుషం. అనైతికం. అలాంటి నాయకుణ్ణి జైలులో పెట్టిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏమైనా చేసిందా? దానికి ప్రజల సమస్యలను తీర్చడానికి తీరిక లేదు. ఒకరి మీద ఒకరికి బురద చల్లుకోవడానికి మాత్రం చాలా తీరిక వుంది. నల్లడబ్బుతో చిక్కినవారూ లిక్కర్ సామ్రాజ్యాలు ఏలుతున్నవారూ పదవులు అలంకరిస్తూ ఉంటే వారికి వంతపాడే కొన్ని మీడియా సంస్థలు... వీటిని చూస్తుంటే ఏ విలువలకీ ప్రస్థానం అనిపిస్తోంది.

ఒకపక్కన కరెంటు మోత, మరోపక్క వంటగ్యాస్ మంట. దానికితోడు పెట్రో వాత... వీటిని ప్రజలు ఎలా భరించాలి? అన్నం పెట్టే రైతుకే తిండి లేకుండా చేశారు. ఎరువుల రేట్లకి రెక్కలు వస్తున్నా నియంత్రించలేదు కానీ ధాన్యం బస్తా రేటు పెంచడానికి మాత్రం నానాతిప్పలు పడుతోంది ప్రభుత్వం. ఈ కష్టాలన్నీ తీరే రోజు వస్తుంది. రాజన్న రాజ్యం వస్తుంది. రైతన్నకు మంచికాలం వస్తుంది. పంటపొలాలే దేశానికి పట్టుగొమ్మలు అనేరోజు తప్పక వస్తుందని ఆశిస్తున్నాను.
- రమ, వెలగతోడు, తూ.గో. జిల్లా

ఎంతకాలం ఈ వేదనలు...

జగన్ కోసం

మహానేత డా. రాజశేఖరరెడ్డి మా నుండి దూరమైనప్పటినుంచి రాష్ట్ర ప్రజలమైన మేము బాధపడని రోజు లేదు. నిశ్చేష్టులమైన మమ్మల్ని ఓదార్చడానికి రాష్ట్రమంతా తిరుగుతూ పల్లెపల్లెకు, వీధివీధికి తానే స్వయంగా వస్తున్న మా జగనన్నను చూసి హర్షించాం. గర్వించాం. ఇంతలోనే వినకూడని వార్త! మా జననేత అరెస్టు. గుండె పగిలిపోయింది... హృదయం కుమిలిపోయింది. ఇప్పటికీ కృశిస్తూనే వుంది. మేం కచ్చితంగా ఒకటి చెప్పదలచుకున్నాం... మా మహానేత ‘కోహినూర్ డైమండ్’. వైయస్సార్ ఉన్నప్పుడు కనీసం ఆయన కళ్లలోకి సూటిగా చూడడానికి కూడా భయపడే ఈ పాలక, ప్రతిపక్ష నాయకులు వైయస్సార్ దూరమయ్యాక మహానేతపై అనేక నిందలు మోపుతున్నారు.

వీరికి తొత్తులుగా మారిన కొన్ని పత్రికలు వారిలో వున్న విషాన్నంతటినీ ఇప్పుడు కక్కుతున్నాయి. జగన్‌కు బెయిల్ రాకుండా ప్రతిరోజూ పత్రికల్లో అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలమైన మా అందరి మదిలో మెదిలే ఒకేఒక్క అనుమానం... ‘న్యాయవ్యవస్థను వారి మీడియానే ప్రభావితం చేస్తుందేమో’నని! మరి అదే నిజమైతే న్యాయదేవత కళ్లు మూసుకుందా? ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయం పక్షాన నిలుస్తుందా? ఇంకెంతకాలం ఈ
వేదనలు?
- టి. నాగన్న, ముసలిమడుగు, కర్నూలు


18, అక్టోబర్ 2012, గురువారం

జగనన్న వదిలిన బాణాన్ని: షర్మిల

ఇడుపులపాయ : రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని షర్మిల తెలిపారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని.... అందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు

16, అక్టోబర్ 2012, మంగళవారం

నా గురించి

నా పేరు శివశంకర రెడ్డి.

నేను ఒక బహుళ జాతి కంపెనీలొ Software Engineer గ పని చేస్తున్నాను.

మా ఊరు :- పాలువాయి, గుంటూరు జిల్లా.

ఇప్పుడు నేను హైదరాబాదు లో ఉంటున్నాను.

15, అక్టోబర్ 2012, సోమవారం

నా మొదటి పోస్ట్

హలో అందరికి నమస్కారం.

నా పేరు శివ. నేను కొత్తగా ఈ బ్లాగ్ ప్రపచంలొకి వస్తున్నాను.

నన్ను మీతొ కలుపుకొండి. 

ధన్యవాదాలు.